రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త మోడల్ వచ్చేసింది..ధర, ఫీచర్స్ ఇవే!

by velandi.Saikiran |

: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి ఉన్న క్రేజ్ అంతా కాదు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి బైక్ ను జనాలు ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పట

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త మోడల్ వచ్చేసింది..ధర, ఫీచర్స్ ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి ఉన్న క్రేజ్ అంతా కాదు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి బైక్ ను జనాలు ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన చాలా బైక్స్... మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ( Royal Enfield ) నుంచి మరో కొత్త బైక్ వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ ను ( Royal Enfield Classic 650 Tween ) తాజాగా లాంచ్ చేసింది కంపెనీ. ఇండియాలోనే ( India ) తాజాగా లాంచ్ చేశారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ ధర 3.37 లక్షలు గా ఉంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే.

మనం కొనుగోలు చేస్తే రేటు... ఒక ప్రాంతంలో ఒక్క విధంగా ఉంటుంది. ఎక్స్ షోరూం కంటే... మనకు ఎక్కువ ధర పడుతుంది. ఇక ఇందులో బ్లాక్ క్రోమ్ వేరియంట్ 3.50 లక్షలు గా ఉన్నట్లు పేర్కొంది. కొత్తగా లాంచ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ లో కూడా నియో రెట్రోలుక్ ఫాలో అయ్యారు. ఈ బైక్ మార్కెట్ లో ఉన్న క్లాసిక్ 350 ని కాస్త పోలి ఉంటుంది. ఈ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్... వల్లం రెడ్, బ్లాక్ క్రోమ్, బ్లూ అలాగే టీల్ కలర్స్ లో మనకు లభిస్తుంది. ఫ్రంట్ వీల్ 19 అంగుళాలు... రియల్ వీల్ 18 అంగుళాలు ఉంటుంది. వైర్ స్పేస్ వీల్స్ కూడా అమర్చారు. ఇక ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే... 648 హెయిర్ ఆయిల్ కూల్డ్ ప్యారలాల్ ట్విన్ ఇంజన్ అమర్చారు. ఆరు స్పీడ్ గేర్ బాక్సులు అందిస్తున్నారు. 52.3 ఎన్ ఎం టార్క్ ను ఈ బైక్ రిలీజ్ చేస్తుంది.

Next Story