- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Retail Inflation: 3.21 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
దీనికి ప్రధానంగా అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో పాటు కీలక ఆహారపదార్థాలు, దుస్తులు, వినియోగ వస్తువుల ధరలు పెరగడమే కారణం.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి వినియోగదారుల ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) 3.21 శాతానికి చేరుకుంది. దీనికి ప్రధానంగా అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో పాటు కీలక ఆహారపదార్థాలు, దుస్తులు, వినియోగ వస్తువుల ధరలు పెరగడమే కారణం. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) గురువారం డేటాను విడుదల చేసింది. కొత్త 2024 బేస్ ఇయర్ సిరీస్ ప్రకారం.. జనవరిలో 2.75 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం, గత నెలలో 47 బేసిస్ పాయింట్లు పెరిగింది. అయితే, ఇప్పటికీ సీపీఐ ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) 4 శాతం లక్ష్యం కంటే తక్కువగానే ఉంది. ఎన్ఎస్ఓ డేటా ప్రకారం, ముఖ్యంగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగేందుకు ఆహార పదార్థాల, బంగారం, వెండి లాంటి విలువైన లోహాల ధరలు పెరగడం, ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పుంజుకోవడం వంటి అంశాలు ప్రభావితం చేశాయి. ఫిబ్రవరిలో కూరగాయలు, తృణ ధాన్యాల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం 3.75 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ధరల ఒత్తిళ్లు కొంచెం ఎక్కువగా ఉండటంతో పట్టణ ద్రవ్యోల్బణం 3.32 శాతంగా, గ్రామీణ ద్రవ్యోల్బణం 3.07 శాతంగా నమోదైంది.






