- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినియోగదారులకు ఊరట.. భారీగా పడిపోయిన వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా పతనమై వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క రోజులోనే వెండి (Silver) కేజీపై ఏకంగా రూ.15,000 తగ్గింది. ఇక బంగారం (Gold) ధరలు మాత్రం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,61,780కి చేరింది. ఇక ఆభరణాలలో వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 మేర పెరిగి రూ.1,48,300 వద్ద కొనసాగుతోంది.
గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన వెండి ధర ఇవాళ భారీగా దిగివచ్చింది. నిన్నటి ధరతో పోలిస్తే ఇప్పుడు కేజీ వెండి రూ.2,85,000 వద్ద పలుకుతోంది. వెండి ఆభరణాలు కొనేవారికి, పెట్టుబడిదారులకు ఇది పెద్ద ఊరట అని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. పసిడి ప్రియులు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిదని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.






