డిపాజిట్లకు KYC కంపల్సరీ

by Dishafeatures2 |
డిపాజిట్లకు KYC  కంపల్సరీ
X

దిశ , తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నోట్ల రద్దు పై తీసుకున్న నిర్ణయంతో వాటిని ఎలా మార్చుకోవాలి అనే సందేహాలు ప్రస్తుతం ప్రతి సామాన్య ప్రజానీకం నుండి ధనిక వర్గాలకు చెందిన వారిని సహితం మనసులో తొలుస్తున్న ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకున్న 2000 రూపాయల రద్దు నేపథ్యంలో RBI పరిధిలోని బ్యాంకులకు పలు సూచనలు జారీచేసిన సంగతి విదితమే . ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఒక చిన్న కిటుకు పెట్టింది . వ్యక్తిగతంగా ఈ నోట్లను మార్పిడి చేసుకునే వ్యక్తులకు సంబందించి వారు RBI నిర్దేశించిన ప్రకారం తమ ఏదైనా గుర్తింపు కార్డు కలిగి ఉండి లేదా ఒక ప్రొఫార్మాను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఖాతాదారులు తమ అకౌంట్లో జమ చేసుకోవాలనుకునే వారు KYC ని సరిచేసుకొని వారు కుడా ఒక ప్రొఫార్మా ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాగా SBI బ్యాంకులు మాత్రం RBI సూచనలు మినహాయించి ప్రజలకు వెసలుబాటు కల్పించింది. ఈనోట్ల మార్పునకు ప్రతి బ్యాంకులో ఒక ప్రత్యేక కౌంటర్ ను కుడా బ్యాంకులు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యాయి.

ప్రస్తుతం RBI పరిధిలో వున్న బ్యాంకులన్ని ప్రభుత్వ ఆదేశానుసారం రెగ్యులర్ ట్రాన్సాక్షన్లకు సరిపడే అమౌంట్ కు నోట్ల రద్దు కారణంగా వచ్చే ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా ఆయా బ్యాంకుల లావాదేవీలను బట్టి అదనంగా ఈ రెండు వేల రూపాయల మార్పిడి వచ్చే వారికీ మరో నోట్లను ఇచ్చేందుకు గాను డబ్బులను సమకూర్చుకునేందుకు కుడా బ్యాంకులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి . రద్దీ ఎక్కువగా ఉండిబ్యాంకులో నగదు అయిపోతే గనుక చెస్ట్ బ్యాంకుల ద్వారా నగదును తెచ్చుకునే వెసలుబాటు బ్యాంకులకు వుంది . బ్యాంకులవద్ద ఖాతాదారులకు ,నోట్ల మార్పిడికోసం వచ్చే ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బదులు కల్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని RBI అన్ని బ్యాంకులకు ఆదేశించింది .

2000 నోటుతో ఎక్కడైనా కొనుగోలు చేయెచ్చు !

RBI నిర్దేశించిన సూచనల ప్రకారం ప్రజలు సెప్టెంబర్ 30 వరకు తమ వద్ద వున్నా 2000 నోట్లతో దేశంలో ఎక్కడైనా కొనుగోళ్లు చేయవచ్చు .ఒక వేళ ఆ నోట్ల స్థానంలో మరో నోట్లు కావాలంటే మాత్రం బ్యాంకు కు వెళ్లి మార్చుకోవాల్సిందే .ఖాతాదారులు మాత్రం తమ వద్ద వున్నా 2000 రూపాయల నోట్లను ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు , ఇందుకు ఎలాంటి లిమిట్ కానీ షరతులు కానీ లేవు. గతంలో 500 నోట్ల మార్పిడిలో బ్యాంకులలో వున్నా సిబ్బందే ఇప్పుడు వున్నారు . వీరితోనే ఈ నోట్ల మార్పిడి చేపట్టాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కానీ అదనపు సిబ్బందిని కేటాయించకుండా రద్దీ ఎక్కువైనప్పుడు అనేక సమస్యలు ఏర్పడుతాయి . వీటిని దృష్టిలో ఉంచుకొని అదనపు సిబ్బందిని నియమిస్తే కొంత ఉపశమనం కలిగే అవకాశం వుంది. రెండువేల రూపాయల నోట్ల మార్పిడి విషయంలో సామాన్య ప్రజలనుండి బ్యాంకులకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాకపోతే రాజకీయ నాయకులూ ,పెద్దపెద్ద వ్యాపారాలు చేసేవారు రియల్ ఎస్టేట్ సంబందించివారు వారికుండే మెకానిజం ద్వారా తమ లావాదేవీలు జరుపుకునేందుకు ప్రయత్నిస్తుంటారు అలంటి వారి నుండే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అల్ ఇండియా బ్యాంకు అసోసియేషన్ కార్యదర్శి సీత రాంబాబు అభిప్రాయపడ్డారు .

Next Story

Most Viewed