- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: చెక్ క్లియరింగ్ రెండో దశను వాయిదా వేసిన ఆర్‌బీఐ
చెక్ క్లియరింగ్ సిస్టమ్ రెండవ దశను తదుపరి నోటీసు వచ్చేవరకు వాయిదా వేసినట్లు ఆర్‌బీఐ బుధవారం ప్రకటనలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: చెక్కులు క్లియర్ చేసేందుకు అయ్యే సమయాన్ని గంటల వ్యవధిలోకి తగ్గించే కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థ అమలులో రెండో దశను భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాత్కాలికంగా వాయిదా వేసింది. బ్యాంకులు తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకోవడానికి మరింత సమయం ఇస్తూ, చెక్ క్లియరింగ్ సిస్టమ్ రెండవ దశను తదుపరి నోటీసు వచ్చేవరకు వాయిదా వేసినట్లు ఆర్‌బీఐ బుధవారం ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 4న మొదటి దశ మొదలవగా, ఆ రోజు నుంచి చెక్కులను డిజిటల్‌గా క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ దశలో బ్యాంకులు చెక్కులను స్కాన్ చేసి ఎలక్ట్రానిక్‌గా ఇతర బ్యాంకులకు పంపుతాయి, డ్రా చేసుకునే బ్యాంకులు వాటిని సాయంత్రం 7 గంటల్లోపు క్లియర్ చేస్తాయి. మరింత సులభంగా చెప్పాలంటే ప్రస్తుతం, ఫేజ్ 1 కింద చెక్కులను డిజిటల్‌గా ప్రాసెస్ చేసి, ఆరోజు ముగిసే నాటికి(సాయంత్రం 7 గంటల్లోపు) క్లియర్ చేస్తాయి. బ్యాంక్ సకాలంలో స్పందించకపోయినా ఆటోమేటిక్ పద్దతిలో ఆమోదం లభిస్తుంది. చెక్ క్లియరింగ్ వ్యవస్థలో రెండో దశ 2026, జనవర్ 3 నుంచి మొదలు కావాల్సి ఉంది. ఈ దశను రియల్-టైమ్ సెటిల్‌మెంట్ కోసం రూపొందించారు. ఈ విధానంలో చెక్కులు 3 గంటల్లోపు ధృవీకరించి, గంటల వ్యవధిలో సెటిల్‌మెంట్‌లు పూర్తి చేయనున్నారు. ఈ దశలో మొదటి దశ కంటే చాలా వేగంగా కస్టమర్లకు నిధులను అందించవచ్చు.






