క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రెంట్ పేమెంట్స్ ఆపేసిన ఫిన్‌టెక్

by Naga Rani Yarlagadda |

క్రెడిట్ కార్డ్.. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ గా దాదాపు ఉద్యోగులందరి వద్ద ఉంటోంది.

క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రెంట్ పేమెంట్స్ ఆపేసిన ఫిన్‌టెక్
X

దిశ, వెబ్‌డెస్క్: క్రెడిట్ కార్డ్.. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ గా దాదాపు ఉద్యోగులందరి వద్ద ఉంటోంది. వచ్చే జీతం సరిపోక.. ఇతర అవసరాల కోసం క్రెడిట్ కార్డు నుంచి డబ్బు తీసుకుని వాడుకునే వారెందరో ఉన్నారు. అయితే ఇందులో ఉండే రెంట్ పేమెంట్ ఆప్షన్ ను భారీస్థాయిలో వినియోగిస్తూ.. నగదు కొరత అవసరాలను తీర్చుకుంటున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా మరో అకౌంట్ కు అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేసి.. తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. దీనిపై ఆర్బీఐ తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ తో ఆ సేవలకు బ్రేక్ పడినట్లయింది. ప్రముఖ ఫిన్ టెక్ సంస్థలైన ఫోన్ పే, పేటీఎం, క్రెడ్.. రెంట్ పేమెంట్ సేవల్ని ఆపివేశాయి. దీంతో క్రెడిట్ కార్డు దారులు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ను చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

క్రెడిట్ కార్డు దారులు రెంట్ పేమెంట్ ఆప్షన్ ద్వారా తమ నగదు అవసరాలను తీర్చుకుంటున్నారన్న విషయాన్ని కొన్నిబ్యాంకులు ముందుగానే గుర్తించాయి. HDFC, ICICI వంటి సంస్థలు ఈ తరహా చెల్లింపులకు 1 శాతం ఫీజును వసూలు చేస్తున్నాయి. పైగా రివార్డు పాయింట్లను కూడా ఆపేశాయి. కొన్ని ఫిన్ టెక్ సంస్థలు సైతం కొన్నాళ్లు ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రెంట్ పేమెంట్ ఆప్షన్ ను ఆపి.. స్ట్రిక్ట్ కేవైసీ రూల్స్ తో తిరిగి ప్రారంభించాయి.

Next Story