- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో లక్ష దాటిన పెట్రోల్ పంపులు
దేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య లక్ష మార్కును దాటింది.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య లక్ష మార్కును దాటింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) గణాంకాల ప్రకారం 2025 డిసెంబర్ వరకు భారత్‌లో మొత్తం 1,00,047 పెట్రోల్ పంపులు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో సుమారు 90 వేలుగా ఉన్న సంఖ్యతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల పెట్రోల్ బంకులే పూర్తి ఆధిపత్యం కనబరుస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఒక్కటే 37 వేలకుపైగా పెట్రోల్ బంకులు నిర్వహిస్తుండగా, భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) కలిపి మరో 30 వేలకుపైగా పంపులు కలిగి ఉన్నాయి.
మొత్తం పెట్రోల్ బంకుల్లో దాదాపు 90 శాతం ప్రభుత్వ రంగ సంస్థలవే కాగా, మిగతా 10 శాతం మాత్రమే రిలయన్స్, నాయరా ఎనర్జీ, షెల్ వంటి ప్రైవేట్ కంపెనీలవి ఉన్నాయి. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటకల్లో పెట్రోల్ బంకులు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంధన సరఫరా మెరుగుపడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అక్కడ కూడా బంకుల సంఖ్య పెరుగుతోంది.






