- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని బ్యాంకుల బ్యాలెన్స్ ఒకేసారి చూసేలా.. పేటీఎంలో కొత్త ఫీచర్
ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పేటీఎం (Paytm) వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరో కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పేటీఎం (Paytm) వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరో కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. యూపీఐ (UPI) ద్వారా అనుసంధానమైన అన్ని బ్యాంకు ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను ఒకే చోట చూపించే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటి వరకు ప్రతి బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి ఖాతా బ్యాలెన్స్‌ను విడివిడిగా చూసుకోవాల్సి వచ్చేది. ఇకపై పేటీఎం యాప్‌లో యూజర్ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేసిన తర్వాత, అనుసంధానమైన అన్ని బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని ఒకే స్క్రీన్‌లో చూడవచ్చు.
ఈ ఫీచర్ వల్ల మొత్తం బ్యాలెన్స్ ఎంత ఉందో సరళంగా తెలుసుకోవడమే కాదు.. ఏ ఖాతాలో ఎంత మొత్తం ఉందో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సేవింగ్స్, శాలరీ, ఖర్చుల కోసం వేర్వేరు ఖాతాలు నిర్వహించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
పేటీఎం యాప్‌లో 'బ్యాలెన్స్ అండ్ హిస్టరీ' సెక్షన్‌లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఒక్కో ఖాతాకు పిన్‌ను ఎంటర్ చేసిన వెంటనే ఆ ఖాతాలో ఉన్న మొత్తాన్ని యాప్ పైభాగంలో చూపిస్తుంది.






