- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chilli Powder: ఆ కారం పొడి ప్యాకెట్ వాడే వారికి అలెర్ట్.. FSSAI ఈ ప్రొడక్ట్‌ను ఎందుకు వెనక్కి పంపింది?
Chilli Powder: ఫుడ్ రెగ్యులేటర్ FSSAI సూచనలను అనుసరించి పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మార్కెట్ నుండి 4 టన్నుల ఎర్ర కారం పొడి(Chilli Powder)ని రీకాల్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: Chilli Powder: ఫుడ్ రెగ్యులేటర్ FSSAI సూచనలను అనుసరించి పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మార్కెట్ నుండి 4 టన్నుల ఎర్ర కారం పొడి(Chilli Powder)ని రీకాల్ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుండి సూచనలను స్వీకరించిన తర్వాత ఈ చర్య తీసుకుంది. అసలేం జరిగిందో వివరంగా తెలుసుకుందాం.
బాబా రాందేవ్(Baba Ramdev) కు చెందిన పతంజలి ఫుడ్స్(Patanjali Foods) కు ఎర్రకారం (Chilli Powder)పొడిని వెనక్కి తీసుకోవాలని FSSAI ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార నియంత్రణ సంస్థ FSSAI సూచనలను అనుసరించి పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మార్కెట్ నుండి 4 టన్నుల ఎర్ర కారం పొడిని వెనక్కి తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పతంజలి ఫుడ్స్‌ను ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా ప్యాక్ చేసిన ఎర్ర మిరప పొడి నిర్దిష్ట బ్యాచ్‌ను రీకాల్ చేయాలని కోరడంతో ఈ చర్య తీసుకుంది. పతంజలి ఫుడ్స్ 4 టన్నుల ఎర్ర కారం పొడి (200 గ్రాముల ప్యాక్) చిన్న బ్యాచ్‌ను రీకాల్ చేసింది అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ అస్థానా ఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్పత్తి నమూనాలను పరీక్షించినప్పుడు, కారం పొడిలో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. FSSAI ఎర్ర మిరప పొడితో సహా వివిధ ఆహార పదార్థాలకు పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని గుర్తించినట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. అంతేకాదు ఈ బ్యాచ్ నంబర్ AJD2400012. ఇది FSSAI నియమాలు, 2011 నిబంధనలకు అనుగుణంగా లేదని వివరించింది.
రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా తమ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ భాగస్వాములకు తెలియజేయడానికి కంపెనీ తక్షణ చర్యలు చేపట్టిందని అస్థానా తెలిపారు. ఉత్పత్తిని కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ సమాచారాన్ని తెలియజేయడానికి కంపెనీ ప్రకటనలను కూడా విడుదల చేసింది. ఉత్పత్తిని కొనుగోలు చేసిన ప్రదేశానికి తిరిగి ఇవ్వాలని, పూర్తి డబ్బును తిరిగి పొందాలని కంపెనీ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. "రీకాల్ చేసిన ఉత్పత్తి విలువ, పరిమాణం చాలా చిన్నది అని అన్నారు.
కంపెనీ తన వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాదారులను మూల్యాంకనం చేస్తోందని.. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కోసం కఠినమైన నాణ్యత నియంత్రణ విధానాలను అవలంబించడానికి.. FSSAI నిబంధనలకు పూర్తి అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద గ్రూపులో భాగమైన పతంజలి ఫుడ్స్ 1986లో స్థాపించారు. ఇది భారతదేశంలోని అగ్రశ్రేణి FMCG కంపెనీలలో ఒకటి. కంపెనీ ఎడిబుల్ ఆయిల్, ఫుడ్ & ఎఫ్‌ఎంసిజి, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాలలో పనిచేస్తుంది. పతంజలి రుచి గోల్డ్, న్యూట్రేలా మొదలైన వివిధ బ్రాండ్‌ల క్రింద ఉత్పత్తులను విక్రయిస్తుంది.
సెప్టెంబర్ త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ స్టాండ్ అలోన్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.308.97 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.254.53 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.8,198.52 కోట్లకు పెరిగింది, గత ఏడాది ఇదే కాలంలో రూ.7,845.79 కోట్లుగా ఉంది.






