సెమీకండక్టర్ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు: అనిల్ అగర్వాల్

by Disha Web Desk 17 |
సెమీకండక్టర్ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు: అనిల్ అగర్వాల్
X

న్యూఢిల్లీ: సెమీకండక్టర్ ప్లాంట్‌ను దేశీయంగా నెలకొల్పడం ద్వారా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారీగా ఉత్పత్తి చేసుకోవచ్చు అని వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ 2022లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వేదాంత , ఫాక్స్‌కాన్‌ కంపెనీల జాయింట్ వెంచర్ మెగా సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేయడానికి గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం మొత్తం రూ. 1.54 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దీని ద్వారా 100,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని కంపెనీలు పేర్కొన్నాయి.


సెమీకండక్టర్ చిప్ ప్లాంట్‌ను ప్రారంభించడం ద్వారా ఆటోమొబైల్ టెక్నాలజీ, ల్యాప్‌టాప్‌, మొబైల్ ఫోన్లకు అవసరమైన చిప్‌ల కొరత తీరుతుందని, స్మార్ట్‌ఫోన్‌లు, ఈవీలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయని అనిల్ అగర్వాల్ అన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు స్వంత సవాళ్లు ఉన్నాయి. వీటన్నింటిని అధిగమించి ప్రాథమిక ముడి పదార్థాలను తయారు చేయడం ప్రాజెక్టు లక్ష్యం అని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed