- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ola Electric: రోడ్‌సర్ ఎక్స్ సిరీస్‌తో ఈ-బైక్ విభాగంలోకి అడుగుపెట్టిన ఓలా ఎలక్ట్రిక్
ఈ మోటార్‌సైకిళ్లు రెండు వేర్వేరు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఈ-మోటార్‌సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. బుధవారం కంపెనీ రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. రూ. 74,999 ప్రారంభ ధరతో రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ పేర్లతో తీసుకొచ్చిన ఈ మోటార్‌సైకిళ్లు రెండు వేర్వేరు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తాయి . ఈ బైకులను కొనుగోలు చేసేందుకు బుధవారం నుంచే బుకింగ్స్ ప్రారంభిస్తున్నామని, మార్చి నుంచి డెలివరీలు అందించనున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రెండు వేరియంట్లలో రోడ్‌స్టర్ ఎక్స్ మూడు బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తుంది. 2.5 కిలోవాట్ అవర్‌తో వచ్చే బైక్ ధర రూ. 74,999 కాగా, ఒక్కసారి ఛార్జింగ్‌తో 144 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 3.5 కిలోవాట్ అవర్‌తో వచ్చే బ్యాటరీ ప్యాక్ ధర రూ. 84,999 ఉండగా, ఇది ఫుల్‌ఛార్జింగ్‌తో 201 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 4.5 కిలోవాట్ అవర్‌తో వచ్చే బైక్ ధర రూ. 94,999తో ఒకసారి ఛార్జింగ్ చేసుకుని 259 కిలోమీటర్లు వెళ్లవచ్చు. ఇక, రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ వేరియంట్ రెండు బ్యాటరీ ప్యాక్స్‌తో రాగా, 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ధర రూ. 1,04,999గా నిర్ణయించారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేసిన తర్వాత 259 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 9.1 కిలోవాట్ అవర్‌తో వచ్చే బైక్ ధర రూ. 1,54,999 కాగా, ఒకసారి ఛార్జింగ్ చేసిన్ 501 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ మోటార్‌సైకిళ్లలో రివర్స్ మోడ్, క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లతో పాటు అత్యాధునిక ఫీచర్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది.






