- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: చమురు సంక్షోభంతో భారత వృద్ధి దెబ్బతినే ఛాన్స్
ఇంధన ధరలు పెరగడం ద్వారా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్‌పీ తెలిపింది. ఇది భారత్‌పై కూడా ప్రభావం చూపవచ్చని, ముఖ్యంగా ఇంధన ధరలు పెరగడం ద్వారా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడింది. ఈ ఏడాది బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 130 డాలర్లకు చేరితే భారత వృద్ధి రేటుపై సుమారు 80 బేసిస్ పాయింట్లు(0.8 శాతం) వరకు క్షీణించవచ్చు. దీనివల్ల భారత దిగుమతి బిల్లు, కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతాయని, భారత కరెన్సీ రూపాయి విలువపైనా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అధిక చమురు ధరల ప్రభావం కేవలం వృద్ధికే పరిమితం కాకపోవచ్చని, కార్పొరేట్ రంగంపైనా ప్రభావం ఉంటుందని ఎస్అండ్‌పీ తెలిపింది. కంపెనీల లాభాలు తగ్గడం, రుణ భారం పెరగవచ్చు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలోనూ మొండి బకాయిలు సుమారు 3.5 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించింది. అయితే, భారత్‌కున్న బలమైన ఆర్థికవ్యవస్థ, మెరుగైన బ్యాంకింగ్ వ్యవస్థ, స్థిరమైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు ముడి చమురు ధరల ప్రభావాన్ని కొంతవరకు తట్టుకోవచ్చని ఎస్అండ్‌పీ పేర్కొంది.






