Anthropic: స్వయంగా షాపింగ్ చేయనున్న ఏఐ

by S Gopi |

ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ యాప్ ద్వారా కిరాణా సామాగ్రి, ఆహారాన్ని ఆర్డర్ చేయడాన్ని పరీక్షిస్తున్నామని ఎన్‌పీసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోహిని రాజోలా తెలిపారు.

Anthropic: స్వయంగా షాపింగ్ చేయనున్న ఏఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌తో కలిసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్త వ్యవస్థను బుధవారం పరీక్షించింది. వినియోగదారులు ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ యాప్ ద్వారా కిరాణా సామాగ్రి, ఆహారాన్ని ఆర్డర్ చేయడంతో పాటు, యూపీఐ ఉపయోగించి చెల్లించడాన్ని పరీక్షిస్తున్నామని ఎన్‌పీసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోహిని రాజోలా తెలిపారు. షాపింగ్‌ను సులభతరం చేయడమే లక్ష్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో యాప్‌లను మార్చాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు ఆర్డర్‌లను ఇవ్వమని, స్వయంగా చెల్లింపులు కూడా చేసేలా ఏఐని కోరవచ్చు. ప్రస్తుతం, దీన్ని కొంతమందితో పరీక్షిస్తున్నారు. బిగ్‌బాస్కెట్, జొమాటో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఏఐ షాపింగ్ చేస్తుంది. ఏఐ స్వయంగా ఖర్చు చేసేందుకు కస్టమర్లు రూ. 15,000 వరకు పరిమితిని సెట్ చేయవచ్చు.

Next Story