Finance Ministry: ప్రస్తుతం ప్రభుత్వం ముందు బ్యాంకుల విలీన ప్రతిపాదన లేదు: ఆర్థిక శాఖ

by S Gopi |

ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు

Finance Ministry: ప్రస్తుతం ప్రభుత్వం ముందు బ్యాంకుల విలీన ప్రతిపాదన లేదు: ఆర్థిక శాఖ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ బ్యాంకుల విలీన ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వం ముందు ఎటువంటి ప్రతిపాదన లేదని సోమవారం ఆర్థిక శాఖ పార్లమెంటుకు సమాచారం అందించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రభుత్వ రంగ బ్యాంకులను 27 నుంచి 12కి తగ్గించింది. ఆ తర్వాత మళ్లీ ఇటీవల మరోసారి చిన్న పీఎస్‌బీలను పెద్ద బ్యాంకుల్లో చేయవచ్చనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకు డిపాజిటర్లతో పాటు ఉద్యోగులు, వాటాదారులలో నెలకొన్న సందేహాలను తొలగిస్తూ ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. మరొక ప్రశ్నకు సమాధానమిచ్చిన పంకజ్ చౌదరి.. ఐసీఈఏ ఆమోదం ప్రకారం ఐడీబీఐ బ్యాంక్‌లో పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని తెలిపారు. ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడుల ఉపసంహరణతో పాటు నిర్వహణ నియంత్రణ అధికారాన్ని కూడా బదిలీ చేసేందుకు 2021లోనే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ, ప్రభుత్వానికి కలిపి 94.72 శాతం వాటా ఉంది. ఇందులో 60.72 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఈ ఏడాది మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంకు దాదాపు రూ. 4.11 లక్షల కోట్ల బకాయిలు ఉండగా, అంతే మొత్తంలో ఆస్తులు కూడా ఉన్నాయని పంకజ్ చౌదరీ పేర్కొన్నారు.

Next Story