- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NHAI: హైవేల పర్యవేక్షణ కోసం ఏఐ సర్వే వాహనాలు: ఎన్‌హెచ్ఏఐ
23 రాష్ట్రాల్లో 20,933 కిలోమీటర్ల హైవేలను పర్యవేక్షించేందుకు నెట్‌వర్క్ సర్వే వాహనాలను(ఎన్ఎస్ఎవీ) మోహరించనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మెరుగుపరిచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. హైవే ప్రయాణంతో పాటు నిర్వహణను కూడా మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 20,933 కిలోమీటర్ల హైవేలను పర్యవేక్షించేందుకు నెట్‌వర్క్ సర్వే వాహనాలను(ఎన్ఎస్ఎవీ) మోహరించనుంది. 3డీ లేజర్ ఇమేజింగ్, 360-డిగ్రీల హై-రిజల్యూషన్ కెమెరాలు, డీజీపీఎస్, అధునాతన సెన్సార్ సూట్‌లతో అమర్చిన ఈ ప్రత్యేక వాహనాలు మనుషుల జోక్యం లేకుండా రోడ్డు పరిస్థితులపై రియల్-టైం డేటాను సేకరిస్తాయి. ఈ వాహనాలు పగుళ్లు, గుంతలు, ప్యాచెస్ వంటి లోపాలను గుర్తిస్తాయి. తద్వారా వీలైనంత వేగంగా దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. సేకరించిన మొత్తం డేటా ఎన్‌హెచ్ఏఐకి చెందిన ఏఐ-ఆధారిత 'డేటా లేక్' ప్లాట్‌ఫామ్‌లో ఫీడ్ అవుతుంది. ఆ తర్వాత డేటాను నిపుణులు సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటారు. అనంతరం రోడ్ అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో డేటా మొత్తం స్టోర్ అవుతుంది. ఏఐ సర్వే వాహనాలు అన్ని 2/4/6/8-లేన్ హైవే ప్రాజెక్టులకు వర్తిస్తుంది. ఈ సర్వేలు హైవే పని ప్రారంభంలో, ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా జరుగుతాయి. ఈ సర్వే అమలు కోసం హెచ్‌హెచ్ఏఐ ఇప్పటికే అర్హత ఉన్నవారి నుంచి బిడ్‌లను ఆహ్వానించింది.






