- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NHAI: ఫాస్టాగ్ వార్షిక పాస్ పేరుతో స్కామ్.. ఎన్‌హెచ్ఏఐ అలర్ట్
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అధికారిక ఎన్‌హెచ్ఏఐ పోర్టల్‌లుగా నమ్మించి, నకిలీ పాస్‌ల కోసం చెల్లింపులు చేయాలంటూ కస్టమర్లను మోసగిస్తున్నాయని పలు నివేదికలు వచ్చిన తర్వాత ఎన్‌హెచ్ఏఐ ఈ అలర్ట్‌ను ఇచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా హైవేలపై టోల్ ప్లాజాల వద్ద సమయాన్ని తగ్గించే లక్ష్యంతో తీసుకోచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్‌లలోనూ సైబర్ స్కామ్‌లు మొదలయ్యాయి. నకిలీ ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల పేరుతో మోసపూరిత వెబ్‌సైట్‌ల నుంచి ప్రజలను మోసగించే పనులు జరుగుతున్నాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అధికారిక ఎన్‌హెచ్ఏఐ పోర్టల్‌లుగా నమ్మించి, నకిలీ పాస్‌ల కోసం చెల్లింపులు చేయాలంటూ కస్టమర్లను మోసగిస్తున్నాయని పలు నివేదికలు వచ్చిన తర్వాత ఎన్‌హెచ్ఏఐ ఈ అలర్ట్‌ను ఇచ్చింది. ఇలాంటి నికిలీ వెబ్‌సైట్లు, లింక్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే వార్షిక పాస్‌లను కొనుగోలు చేయాలని సూచించింది. వార్షిక పాస్‌ల గురించి సెర్చ్ చేసినప్పుడు టాప్ లిస్ట్‌లో నకిలీ వెబ్‌సైట్ లింకులు వచ్చేలా సైబర్ మోసగాళ్లు చేస్తున్నారు. ఈ మోసపూరిత సైట్‌లు ప్రొఫెషనల్‌గా కనిపించేలా, చట్టబద్ధమైన ప్రభుత్వ పోర్టల్‌లను పోలి ఉండేలా రూపొందించారు. దీనివల్ల ప్రజలు వాటిని గుర్తించడంలో కష్టమవుతుంది. వాటిని క్లిక్ చేయగానే ఫోన్ నంబర్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ లాంటి వ్యక్తిగత వివరాలు కోరుతాయి. పేమెంట్ గేట్‌వే ద్వారా చేసే చెల్లింపులు నేరుగా సైబర్ మోసగాళ్ల అకౌంట్లకు చేరుతున్నాయి. ఈ మోసాల బారిన పడకుండా కస్టమర్లు ఎన్‌హెచ్ఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో మాత్రమే వార్షిక ఫాస్టాగ్ పాస్‌లను కొనుగోలు చేయాలని వెల్లడించింది.






