- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aadhar App: కొత్త ఆధార్ యాప్ విడుదల చేసిన కేంద్రం
ఈ కొత్త యాప్ ద్వారా ప్రజలకు ఆధార్ సేవలు మరింత సులభంగా, సురక్షితంగా, యూజర్ ఫ్రెండ్లీగా మారుతాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: మనదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన అడుగుగా భారత ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ కొత్త యాప్ ద్వారా ప్రజలకు ఆధార్ సేవలు మరింత సులభంగా, సురక్షితంగా, యూజర్ ఫ్రెండ్లీగా మారుతాయి. దేశ రాజధాని ఢిల్లీలోని డాక్టర్.అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ యాప్ లాంచ్ సందర్భంగా జాతికి అంకితం చేశారు.
ఆధార్ యాప్ ముఖ్యమైన ఫీచర్లు
కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆధార్ యాప్ అనేక రకాల ప్రజా-కేంద్రీకృత ఫీచర్లను అందిస్తోంది. అవి..
* ఈ యాప్ ద్వారా పూర్తి సమాచారం ఇవ్వడానికి బదులుగా నిర్దిష్ట ఆధార్ వివరాలను మాత్రమే షేర్ చేయవచ్చు.
*యాప్‌లో ఐదుగురు కుటుంబ సభ్యుల వరకు ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసే వీలుంటుంది.
* యాప్ ద్వారా ఆధార్‌ను తక్షణమే వెరిఫికేషన చేసుకోవచ్చు.
* యాప్ నుంచే నేరుగా ఆధార్‌లో చిరునామాను అప్‌డేట్ చేయవచ్చు.
* రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను మార్చడం లేదా అప్‌డేట్ చేసుకోవచ్చు.
* డిజిటల్ ఆధార్ కాంటాక్ట్ కార్డ్‌ని ఉపయోగించి ఆధార్ కాంటాక్ట్ వివరాలను సురక్షితంగా షేర్ చేయవచ్చు.
* ఈ యాప్ యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ కావడంతో సరళంగా, స్పష్టంగా సేవలు అందుబాటులో ఉంటాయి.
మెరుగ్గా డిజిటల్ ఐడెంటిటీ సేవలు
ఆధార్ యాప్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా తమ డిజిటల్ ఐడెంటిటీని సజావుగా చూపించడానికి, పంచుకోవడానికి, ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది. క్యూఆర్-ఆధారిత ధృవీకరణ, సురక్షిత యాక్సెస్‌తో, గోప్యత, సులభ వినియోగం ద్వారా భౌతిక పత్రాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి యాప్ సహకరిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.






