- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mukesh Ambani: సాంకేతికత, పరిశ్రమల్లో భారత్ స్వావలంబన సాధించాలి: ముఖేష్ అంబానీ
ప్రస్తుతం ప్రపంచమంతా వైబ్రంట్ ఇండియా గురించి మాట్లాడుతోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తయారీలో సొంతంగా ఎదగాలని బిలియనీర్ ముఖేష్ అంబానీ అన్నారు. దీనివల్ల దేశ భవిష్యత్తు పురోగతికి సవాళ్లుగా మారే భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవచ్చని తెలిపారు. గురువారం పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ విశ్వవిద్యాలయానికి చెందిన 13వ స్నాతకోత్సవంలో మాట్లాడిన ఆయన.. మనదేశం 8 శాతం వృద్ధితో వేగంగా దూసుకుపోతున్నది. మిగిలిన ప్రపంచం విశ్వాసం కోల్పోతున్న సమయంలో భారత్ మరింత ఆశ, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. దశాబ్దం క్రితం దేశంలోని అన్ని ప్రాంతాలు వైబ్రంట్ గుజరాత్ గురించి మాట్లాడాయి. ప్రస్తుతం ప్రపంచమంతా వైబ్రంట్ ఇండియా గురించి మాట్లాడుతోంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత్ భవిష్యత్తు పురోగతికి సవాళ్లను సృష్టించాయి. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడే మనం కీలక టెక్నాలజీ, పరిశ్రమల విభాగంలో ఆత్మ నిర్భర్, స్వావలంబనగా మారాలని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. ముఖేష్ అంబానీ నిర్దిష్ట భౌగోళిక సవాళ్లను పేర్కొనకపోయినప్పటికీ, అనేక దేశాలకు ప్రస్తుతం ముఖ్యమైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం పెద్ద సమస్యగా మారింది. ప్రపంచ సరఫరా గొలుసులలో ఎక్కువ భాగాన్ని, అనేక ముఖ్యమైన ఖనిజాల(ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, చిప్స్ మొదలైన వాటికి ఉపయోగించే వాటి)పై చైనా నియంత్రణ ఉంది. దీనివల్ల ఇతర దేశాలు చైనాపై ఎక్కువగా ఆధారపడక తప్పట్లేదు. దేశాల మధ్య సంబంధాలు ప్రతికూలంగా మారితే ఇది ప్రమాదకరం కావచ్చని అంబానీ పేర్కొన్నారు.






