- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు మరో తీపికబురు.. బెంగళూరులో గూగుల్ మెగా క్యాంపస్
ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) సర్కార్ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) సర్కార్ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాకు భారతీయ ఇంజనీర్లను తీసుకెళ్లడం కంటే భారత్‌లోనే తన కార్యకలాపాలను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బెంగళూరు (Bengaluru)లో ఏకంగా 20 వేల మంది పట్టేంత గూగుల్ మెగా క్యాంపస్ (Google Mega Campus)ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు వైట్‌ఫీల్డ్ టెక్ కారిడార్‌లో ఉన్న అలెంబిక్ సిటీ (Alembic City)లో గూగుల్ సుమారు 2.4 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మూడు భారీ టవర్లలో ఒక దానిని ఇప్పటికే లీజుకు తీసుకోగా మొదటి టవర్‌లో రాబోయే కొన్ని నెలల్లోనే కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి
యువతకు భారీగా ఉపాధి అవకాశాలు..
బెంగళూరులో గూగుల్ మెగా క్యాంపస్ ఏర్పాటుతో ప్రస్తుతం భారత్‌లో గూగుల్‌కు 14 వేల మంది ఉద్యోగులు ఉండగా ఆ సంఖ్య 34 వేలకు చేరనుంది. అంటే దాదాపు 20వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచాలని యోచిస్తోంది. గతంలో ఇది కేవలం 2వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల మధ్య ఉండేది. వీసా ఇంటర్వ్యూలలో జాప్యం, సోషల్ మీడియా స్క్రీనింగ్, ఇతర నిబంధనల వల్ల కొత్త ఉద్యోగులను అమెరికా తీసుకెళ్లడం కంపెనీలకు భారంగా మారింది.
ఏయే విభాగాల్లో ఉద్యోగాలు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, చిప్ డిజైనింగ్ రంగాల్లో భారత్‌లో ఉన్న టాలెంట్‌ను ఉపయోగించుకోవాలని గూగుల్ భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే బెంగళూరులో గూగుల్ మెగా క్యాంపస్‌లో AI అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నీషియన్లు, క్లౌడ్ కంప్యూటింగ్ డైరెక్టర్లు, సెమీ కండక్టర్ చిప్ డిజైనర్లు, జనరేటివ్ AI టూల్స్ డెవలపర్ పోస్టులు ఉండున్నాయి.






