8th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు.. మీ జీతాలు ఎంత పెరుగుతాయో తెలుసా?

by Vennela |   (  Updated:2025-01-16 11:46:56  IST  )

8th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. 8వ పే కమిషన్ ఏర్పాటుపై కీలక అడుగు పడింది. గత కొన్ని నెలలుగా చర్చల్లో నిలుస్తున్న 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

8th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు.. మీ జీతాలు ఎంత పెరుగుతాయో తెలుసా?
X

దిశ,వెబ్‌డెస్క్: 8th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ(Pm Modi) సర్కార్ తీపికబురు వినిపించింది. 7వ వేతనం సంఘం(7th Pay Commission) కాలపరిమితి ముగిసింది. ఇప్పుడు 8వ వేతన సంఘం(8th Pay Commission) ఏర్పాటు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం ఏర్పాటు అయితే ఉద్యోగులకు జీతాలు పెరగడం గ్యారెంటీ. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకునే వార్త అని చెప్పుకోవచ్చు.

తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా చర్చల్లో నిలుస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav)తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. దీంతో 8వ పే కమిషన్(8th Pay Commission) ఏర్పాటుకు తొలి అడుగు పడిందని చెప్పవచ్చు.

2014లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 7వ వేతన సంఘం(7th Pay Commission) ఏర్పాటు చేసి అమల్లోకి తీసుకువచ్చింది. అయితే అది జరిగి 10ఏళ్లు కావడంతో ఇప్పుడు కొత్తగా 8వ వేతన సంఘం (8th Pay Commission)ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపై కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం.

8వ వేతన సంఘం ఏర్పాటు, ఓపీఎస్ పునరుద్ధరణ, కోవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ(DA) విడుదల చేయాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మారుతున్న ద్రవ్యోల్బనాన్ని పరిగణలోనికి తీసుకుని ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయించే విధంగా వేతనం సంఘం ఏర్పాటు కానుంది. ఈ 8వ వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు సానుకూల దిశలోనే సాగుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో దీనిపై కీలక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం దాదాపు రెట్టింపు అవుతుంది. 8వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను 3.68 రెట్లు ఉండవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది అమలైతే దాని సిఫార్సులకు అనుగుణంగా జీతాలు, పెన్షన్ వంటి ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Next Story