- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MG Motor: 50 వేల 'విండ్సర్' ఈవీ అమ్మకాలతో ఎంజీ మోటార్ రికార్డు
అత్యంత వేగంగా 50 వేల సేల్స్ మార్కును చేరిన ఈవీ కారుగా విండ్సర్ మోడల్ నిలిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అరుదైన మైలురాయిని అధిగమించింది. భారత మార్కెట్లో కంపెనీకి చెందిన విండ్సర్ ఈవీ కారు కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలను సాధించినట్టు బుధవారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. తొలిసారిగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఈ ఈవీ మోడల్‌ను 2024, అక్టోబర్‌లో విడుదల చేసింది. దీంతో అత్యంత వేగంగా 50 వేల సేల్స్ మార్కును చేరిన ఈవీ కారుగా విండ్సర్ మోడల్ నిలిచింది. గతేడాది పొడవునా ఎంజీ విండ్సర్ నెలకు 3,800 యూనిట్లకు పైగా అమ్ముడవుతోంది. ఇటీవల 4 వేల మార్కును కూడా దాటింది. మెట్రో ప్రాంతాల్లోనే కాకుండా టైర్2, టైర్3 పట్టణాల్లోనూ వినియోగదారులకు ఈ కారును ఇష్టపడుతున్నారు. ఎంజీ విండ్సర్ వినూత్న డిజైన్, అత్యుత్తమ పనితీరు అందరికీ సౌకర్యంగా ఉందని కంపెనీ ఎండీ అనురాగ్ మెహ్రోత్రా అన్నారు. రికార్డు స్థాయిలో 50 వేల అమ్మకాలను సాధించిన విండ్సర్ భారత్ ఈవీ ప్రయాణంలో ఒక మైలురాయిని సూచిస్తుంది. ఇది మా బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ మోడల్ కారులో కంపెనీ ఇటీవలే లిమిటెడ్ ఎడిషన్ విండ్సర్ ఇన్‌స్పైర్‌ను విడుదల చేసింది. ఇది రూ. 9.99 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుండగా, కిలోమీటర్‌కు కేవలం రూ. 3.9 ఖర్చుతో ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.






