ఎంజీ మోటార్ ఇండియా ఆర్థిక మోసాలపై దర్యాప్తు!

by Disha Web Desk 17 |
ఎంజీ మోటార్ ఇండియా ఆర్థిక మోసాలపై దర్యాప్తు!
X

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా పై ప్రభుత్వం విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల ఆర్థిక లోపాలతో పాటు, ప్రభుత్వం తాజాగా ఎంజీ మోటార్ ఇండియా ఆడిట్ లోపాలు, ఇన్‌వాయిస్ మోసాలకు పాల్పడినట్టు గుర్తించి దర్యాప్తు మొదలు పెట్టినట్టు సమాచారం.

చెందిన సియాక్ మోటార్ కాపొరేషన్‌కు చెందిన కంపెనీయే ఎంజీ మొటార్ ఇండియా. కంపెనీ దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ ఆర్థిక ఫలితాల వివరాల్లో అవకతవకలు ఉన్నట్టు తేలిందని, దీనికి సంబంధించి దర్యాప్తు మొదలుపెట్టినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధిత వర్గాలు తెలిపాయి.

కంపెనీ వెల్లడించిన ఆర్థిక వివరాల్లో పన్ను ఎగవేతలతో పాటు తప్పుడు బిల్లులు, అనుమానిత వ్యక్తులకు చెల్లింపులు చేయడంతో పాటు పలు అవకతవకలు ఉన్నాయని తేలినట్టు వారు వివరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కంపెనీ డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్, ఆడిటర్లకు మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు అందాయని ఎంజీ మోటార్ స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఫలితాల్లో నష్టాలు ప్రకటించడం గురించి కేంద్రం వివరణ కోరిందని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.



Next Story

Most Viewed