రోడ్లపైకి ఎంజీ కామెట్ ఈవీ కార్.. టు వీలర్ మార్కెట్‌ షేక్

by Disha Web Desk 21 |
రోడ్లపైకి ఎంజీ కామెట్ ఈవీ కార్.. టు వీలర్ మార్కెట్‌ షేక్
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల చిన్న కార్లకు డిమాండ్ పెరిగిపోతోంది. పెట్రోల్ రేట్లు మండిపోతున్న తరుణంలో చిన్నకార్ల డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇటీవల చిన్నకార్ల మార్కెట్లోకి పలు కంపెనీలు తమ ఉత్పత్తులను వేగంగా విడుదల చేస్తున్నాయి. అలాంటిదే ఈ ఎంజీ కామెట్ ఈవీ కార్. ఎంజీ మోటార్స్ మార్కెట్లోకి ఎంజీ కామెట్ ఈవీ కార్‌ని విడుదల చేసింది. ఇది చిన్న కార్ల మార్కెట్ ను ఆకర్షించడటమే కాదు. దర తక్కువగా ఉండటంతో టు వీలర్ మార్కెట్‌ను కూడా ఆకర్షిస్తోంది. ఎలక్ట్రిక్ కారు కావడంతో టు వీలర్ కంటే తక్కువ ఖర్చుతో ప్రయాణించే వీలుంది. ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఇండియాలో అధికారికంగా లాంచ్ అయింది. ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు రోడ్లపై రయ్ రయ్ మంటూ పరుగులు తీస్తోంది. చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా ఈ కారు నిలిచింది. ముఖ్యంగా సిటీ ప్రయాణానికి అనువుగా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది.

ఎంజీ కామెట్ ఈవీ ధర: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ.7.98లక్షలుగా ఉంది. బుకింగ్‍లు మే 15వ తేదీనుంచి ఓపెన్ కావడంతో ప్రస్తుతం రోడ్లపై కనిపిస్తున్నాయి.
స్మాల్ ఎలక్ట్రిక్ కార్: స్మాల్ ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ కామెట్ ఈవీ మార్కెట్లోకి విడుదలైంది. వచ్చింది. ఈ కారు పొడవు 1,640 mm, వెడల్పు 1505mmగా ఉంది. 12 ఇంచుల వీల్‍లతో టూ డోర్ మోడల్‍గా లభిస్తుంది.
బ్యాటరీ రేంజ్ ఎంతంటే: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు 17.3kWh బ్యాటరీరీ కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‍లతో లభిస్తుంది.
పర్ఫార్మెన్స్ అదుర్స్: సింగిల్ మోటార్‌లో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఉంటుంది. 41 hp పీక్ పవర్‌ను, 110 Nm పీక్ టార్క్యూను ఇది ప్రొడ్యూజ్ చేస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లుగా ఉంది.
ఫీచర్స్ ఇవే: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు లోపల 10.25 ఇంచుల సైజ్ ఉండే రెండు స్క్రీన్‍లు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్‍మెంట్ డిస్‍ప్లేగా ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్‍ప్లేగా ఉంటుంది. కంట్రోల్‍లతో కూడిన టూ స్పోక్ స్టీరింగ్ వీల్ దీనిలో ఉంటాయి. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, రేర్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ లాంటి ఫీచర్లు ఉంటాయి.
కలర్ ఆప్షన్ : వైట్, బ్లాక్, సిల్వర్ సింగిల్ కలర్ ఆప్షన్‍లతో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ అందుబాటులో ఉంది. బ్లాక్‍ రూఫ్‍తో గ్రీన్, బ్లాక్ రూఫ్‍తో వైట్ డ్యుయల్ టోన్ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.


Next Story

Most Viewed