Maruti Suzuki: రూ. 30,000 వరకు ధరలు పెంచిన మారుతీ సుజుకి

by S Gopi |

మోడల్‌ను బట్టి ధరలు గరిష్టంగా రూ. 30,000 వరకు పెరగనున్నాయి. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

Maruti Suzuki: రూ. 30,000 వరకు ధరలు పెంచిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది జూన్ నుంచి కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాల ధరల భారం, పెరిగిన తయారీ వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మోడల్‌ను బట్టి ధరలు గరిష్టంగా రూ. 30,000 వరకు పెరగనున్నాయి. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. గత కొన్ని నెలలుగా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు అంతర్గతంగా పలు చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ భారాన్ని పూర్తిగా భరించడం సాధ్యం కావట్లేదని మారుతీ సుజుకి పేర్కొంది. ఖర్చు తగ్గింపు చర్యల ద్వారా ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చేసినా, కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం తప్పట్లేదని స్పష్టం చేసింది. వినియోగదారులపై పడే ప్రభావాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూస్తున్నామని వివరించింది. గతేడాది జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత కంపెనీ తన ఆల్టో కె10, సెలెరియో, వ్యాగన్ ఆర్ లాంటి ఎంట్రీ లెవల్ కార్ల ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే.

Next Story