- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maruti Suzuki: ఒక్కో షేర్‌కు రూ. 140 డివిడెండ్ ప్రకటించిన మారుతీ సుజుకి
by S Gopi |
కంపెనీ వార్షిక సమావేశంలో దీనికి ఆమోదం లభించిన తర్వాత ఆగష్టు 7 రికార్డు తేదీగా నిర్ణయించి, సెప్టెంబర్ 9న డివిడెండ్ చెల్లించనున్నట్టు తెలిపింది.

X
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఒక్కో షేర్‌కు రూ. 140 డివిడెండ్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 135 డివిడెండ్ ఇచ్చింది. కంపెనీ వార్షిక సమావేశంలో దీనికి ఆమోదం లభించిన తర్వాత ఆగష్టు 7 రికార్డు తేదీగా నిర్ణయించి, సెప్టెంబర్ 9న డివిడెండ్ చెల్లించనున్నట్టు తెలిపింది. జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి కంపెనీ రికార్డు స్థాయి అమ్మకాలను సాధించింది. మొత్తం 6.76 లక్షల యూనిట్లు అమ్ముడవగా, ఇది గతేడాదితో పోలిస్తే 11.8 శాతం ఎక్కువ. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ 30 శాతానికి పైగా వృద్ధితో రూ. 4,409 కోట్ల నిర్వహణ లాభాలను, 6.9 శాతం తక్కువగా రూ. 3,590 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది.
Next Story






