- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LIC: ఎల్ఐసీ కొత్త డిజిటల్ స్టెప్
ఈ యాప్స్‌ను ఉపయోగించి వినియోగదారులు ఎల్ఐసీ సేవలను సులభంగా యాక్సెస్ పొందడంతో పాటు ఇంటి వద్ద నుంచే అనేక పనులు పూర్తి చేయవచ్చని స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మరింత వేగంగా డిజిటల్ సేవలను విస్తరిస్తోంది. గతవారం ఎల్ఐసీ పాలసీదారులతో పాటు తమ సంస్థ ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా రెండు యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్స్‌ను ఉపయోగించి వినియోగదారులు ఎల్ఐసీ సేవలను సులభంగా యాక్సెస్ పొందడంతో పాటు ఇంటి వద్ద నుంచే అనేక పనులు పూర్తి చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ తీసుకొచ్చిన రెండు కొత్త యాప్‌లు ఏంటి? వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ఎల్ఐసీ పెరుగుతున్న టెక్నాలజీ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సులభంగా బీమా సేవలు అందించేందుకు ఈ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. పాలసీదారుల కోసం 'మై ఎల్ఐసీ', ఏజెంట్ల కోసం 'సూపర్ సేల్స్ సాథీ' యాప్స్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌లను కస్టమర్లకు బీమా సేవలు సులభంగా అందిస్తూనే, ఏజెంట్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఏఐ లాంటి కొత్త టెక్నాలజీ ఉపయోగించి వీటిని రూపొందించారు. ఎల్ఐసీ బ్రాంచ్ వరకు వెళ్లే పనిలేకుండా ఇంటి వద్ద నుంచే పనులు పూర్తి చేయవచ్చు. ఎల్ఐసీ డిజిటల్ ఎకోసిస్టమ్ సేవలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని సేవలు ఒకే చోట అందించే ప్లాట్‌ఫామ్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. కొత్తగా తెచ్చిన యాప్స్ ద్వారా ఎల్ఐసీ వృద్ధి చెందడంతో పాటు మెరుగైన సేవలు లభిస్తాయని సంస్థ చెబుతోంది.
మై ఎల్ఐసీ యాప్
పాలసీదారుల కోసం ప్రారంభించిన 'మై ఎల్ఐసీ' యాప్ ద్వారా కస్టమర్లు సులభంగా తమ బీమా పోర్ట్‌ఫోలియోను నిర్వహించవచ్చు. తక్షణం ప్రీమియంల చెల్లింపులు చేయవచ్చు. పాలసీ ప్రయోజనాలను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు, పాలసీలపై లోన్ తీసుకోవచ్చు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో పాలసీలను అప్‌డేట్ చేయవచ్చు, క్యాన్సిల్ అయిన పాలసీలను కూడా ఆన్‌లైన్‌లోనే రెన్యూవల్ చేసుకోవచ్చు. కొత్త పాలసీల గురించి అన్ని వివరాలను తెలుసుకోవడంతో పాటు సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు.
ఎలా ఉపయోగించాలి
ఈ యాప్ ఉపయోగించాలనుకునే పాలసీదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి మై ఎల్ఐసీ యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. ఆ తర్వాత లాగ్-ఇన్ ఆప్షన్‌లో మొబైల్ నంబర్ లేదా పాలసీ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాలి. ఈ-మెయిల్ ఐడీ ద్వారా కూడా లాగిన్ అవ్వొచ్చు. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే వివిధ రకాల సేవలను ఎంచుకుని పూర్తి చేయవచ్చు. అందులోనే ఎల్ఐసీకి చెందిన వివిధ రకాల సమాచారం తెలుసుకోవచ్చు.
సూపర్ సేల్స్ సాథీ యాప్
ఏజెంట్ల కోసం లాంచ్ చేసిన 'సూపర్ సేల్స్ సాథీ' యాప్ పూర్తిగా కొత్త డిజిటల్ సేల్స్ టూల్స్ ఆధారంగా పనిచేస్తుంది. పాలసీ స్టేటస్ రియల్ టైమ్‌లో చెక్ చేయవచ్చు. ఇందులోనే పాలసీదారుల ప్రీమియం చెల్లింపుల వివరాలను ఏజెంట్లు చూడవచ్చు. ఏఐ టూల్స్ సాయంతో పాలసీదారులకు సరైన సూచనలు ఇవ్వవచ్చు. ఆన్‌బోర్డింగ్ నుంచి పాలసీ సర్వీసింగ్ వరకు, వినియోగదారులకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి వీలుంటుంది. మార్కెటింగ్ ఇన్‌సైట్స్, పనితీరును ట్రాక్ చేసుకోవడం, పాలసీ సర్వీసింగ్ కోసం డిజిటల్ టూల్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి.






