LIC: నకిలీ యాప్‌లపై పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక

by S Gopi |
LIC: నకిలీ యాప్‌లపై పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సంస్థ పాలసీదారుల కోసం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల పెరుగుతున్న డిజిటల్ మోసాల్లో భాగంగా కొందరు సైబర్ మోసగాళ్లు కస్టమర్లను మోసం చేసేందుకు నకిలీ ఎల్ఐసీ పేరును, యాప్‌ను ఉపయోగిస్తున్నట్టు గుర్తించామని, అటువంటి అప్లికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పాలసీదారులు, ఇతర వినియోగదారులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ నుంచే మాత్రమే ఎలాంటి లావాదేవీలనైనా నిర్వహించాలని సూచించింది. ఎల్ఐసీ పేరు మీద ఈ మధ్య నకిలీ యాప్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. ఎవరైనా అలాంటి నకిలీ యాప్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేసే ఏవైనా చెల్లింపులకు ఎల్ఐసీ బాధ్యత వహించదని స్పష్టం చేసింది. నకిలీ యాప్‌లపై ఎక్కువగా ఫిర్యాదులు అందించ నేపథ్యంలో ఎల్ఐసీ పబ్లిక్‌ అడ్వైజరీని జారీ చేసింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. ఎల్ఐసీ ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఎల్ఐసీ డిజిటల్ యాప్‌ల నుంచే లావాదేవీలు జరపాలని తెలిపింది. అధికారిక యాప్ కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది.

Next Story