Price Hike: ధరలు పెంచిన జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్

by S Gopi |

ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల, కొన్ని మోడళ్లలో కొత్త ఫీచర్లు జోడించడం వల్ల ధరలు పెంచినట్టు కంపెనీ తెలిపింది.

Price Hike: ధరలు పెంచిన జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. సగటున 1.5 శాతం మేర పెంపు నిర్ణయం తీసుకున్నామని, జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. ముడి పదార్థాల ధరలు, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల, కొన్ని మోడళ్లలో కొత్త ఫీచర్లు జోడించడం వల్ల ధరలు పెంచినట్టు కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో పెరుగుతున్న ఇన్‌పుట్ భారాన్ని సర్దుబాటు చేయడం కోసం, భౌగోళిక రాజకీయ పరిణామాలతో ఏర్పడిన ప్రతికూల ప్రభావాన్ని భర్తీ చేసేందుకు ధరలను సవరిస్తున్నట్టు కంపెనీ వివరణ ఇచ్చింది. ఇదివరకు జనవరిలో కంపెనీ తన ఈవీ మోడల్ విండ్సార్‌ అన్ని వేరియంట్‌ ధరల్ని రూ.50 వేలు పెంచింది. అంతేకాకుండా పెరిగిన వ్యయం కారణంగా ఫ్రీ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఆపేసింది.

Next Story