- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JioHotstar: యాప్‌లోనే ఫుడ్ ఆర్డరింగ్
ఈ ఫీచర్ ప్రస్తుతం దేశంలోని 690కి పైగా నగరాల్లో అందుబాటులోకి తీసుకురాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటికే 3.7 కోట్ల మందికి పైగా వీక్షకులు దీన్ని ఉపయోగించినట్లు కంపెనీలు తెలిపాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రికెట్ లేదా ఇతర లైవ్ స్ర్టీమింగ్ సమయంలో ఆకలేస్తే జియోహాట్‌స్టార్ యాప్ బయటకు వెళ్లకుండా సులభంగా ఫుడ్ ఆర్డర్ చేసుకునేలా ‘ఇన్-యాప్ ఫుడ్ ఆర్డరింగ్’ను లాంచ్ చేసింది. దీనికోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం దేశంలోని 690కి పైగా నగరాల్లో అందుబాటులోకి తీసుకురాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటికే 3.7 కోట్ల మందికి పైగా వీక్షకులు దీన్ని ఉపయోగించినట్లు కంపెనీలు తెలిపాయి. మొబైల్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఇంటిగ్రేషన్ ద్వారా, మ్యాచ్ చూస్తూనే రెస్టారెంట్లు బ్రౌజ్ చేయడం, ప్రత్యేక ఆఫర్లు పొందడం, ఆర్డర్ ఇవ్వడం, డెలివరీ ట్రాక్ చేయడం వంటి సదుపాయాలు లభిస్తాయి. ఇప్పటివరకు లైవ్ క్రికెట్ సమయంలో బిర్యానీ కంటే బర్గర్‌లు అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్‌గా నిలిచింది. ఒక యూజర్ ఈ సీజన్‌లో 34 సార్లు ఆర్డర్ చేయగా, మరొకరు ఒకేసారి 100కి పైగా బర్గర్‌లు ఆర్డర్ చేసినట్లు కంపెనీలు వెల్లడించాయి. అత్యధికంగా రూ. 6,801 విలువైన ఒకే ఆర్డర్ నమోదవ్వగా, కొందరు యూజర్లు మ్యాచ్ ఆఫర్ల ద్వారా దాదాపు రూ. 13 వేల వరకు ఆదా చేసుకున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ల సమయంలో అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలు ఆర్డరింగ్‌లో ముందుండగా, పాట్నా, పూణే వంటి నగరాల నుంచి కూడా మెరుగైన స్పందన లభించింద కంపెనీలు పేర్కొన్నాయి.






