- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRAI: 32 లక్షల మంది కొత్త కస్టమర్లతో జియో ఆధిపత్యం
భారతీ ఎయిర్‌టెల్ 4,37,717 మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో టెలికాం రంగానికి సంబంధించి ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ జియో ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్ నెలలో కంపెనీ కొత్తగా 32.5 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్లను సాధించింది. ఇదే నెలలో మరో ప్రైవేట్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 4,37,717 మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సోమవారం గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, సమీక్షించిన నెలలో ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఏకంగా 7,44,222 మంది కస్టమర్లను కోల్పోయింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ మాత్రం కొత్తగా 5,24,014 మందిని సంపాదించుకుంది. దీంతో రిలయన్స్ జియో మొత్తం 49.22 కోట్ల సబ్‌స్క్రైబర్‌లతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్ 30.06 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ 12.77 కోట్లతో మూడో స్థానంలో, బీఎస్ఎన్ఎల్ 3.03 కోట్లతో నాల్గవ స్థానంలో ఉంది.






