- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IT Layoff: మళ్లీ పెరుగుతున్న ఐటీ లేఆఫ్స్
గతంలో మాదిరిగా కాకుండా ఐటీ సేవల సంస్థలు తమ ఉద్యోగులను సాంప్రదాయ కోణంలో కాకుండా ఇతర అంశాల కారణంగా తొలగిస్తున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ రంగంలో మరోసారి తొలగింపులు మొదలయ్యాయి. ఇటీవలి లేఆఫ్స్ ధోరణిని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఐటీ సేవల సంస్థలు తమ ఉద్యోగులను సాంప్రదాయ కోణంలో కాకుండా సంస్థ పునర్నిర్మాణం, వర్క్‌ఫోర్స్ ఆప్టిమైజేషన్, సంస్థ పురోగతి వంటి అంశాల కారణంగా తొలగిస్తున్నట్టు చెబుతున్నాయి. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది జూలైలో సుమారు 12,000 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రధానంగా కంపెనీని పునర్నిర్మాణంలో భాగంగా తీసుకున్నదని వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే మరో గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ కూడా ఒకే త్రైమాసికంలో 11,000 కంటే ఎక్కువ ఉద్యోగుల కోతను ప్రకటించింది. ఏఐ యుగంలో కొత్త ఉద్యోగాల కోసం ఈ తొలగింపులు తీసుకున్నన్నప్పటికీ, రానున్న రోజుల్లో నియామకాలు చేపట్టాలనే ఉద్దేశం ఉందని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ లేఆఫ్స్‌ను ఖర్చులు, పెరుగుతున్న నైపుణ్య-అవసరాలు, ఆటోమేషన్, ఏఐ అడాప్టేషన్ వంటి ఒత్తిళ్లు ప్రభావితం చేస్తున్నాయి. అనేక సంస్థలు సంస్థాగత నిర్మాణాన్ని సరళతరం చేస్తున్నాయని, అన్వసర ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్నాయి. ఏఐ, క్లౌడ్ వంటి కొత్త టెక్నాలజీపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయని, అందుకే ఉద్యోగులను సైతం తొలగించే పని పెట్టుకున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏదైనపటికీ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 80,000 కంటే ఎక్కువ టెక్ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని అంచనా.






