IPOs: ఐపీఓల ద్వారా రికార్డు స్థాయి రూ. 1.76 లక్షల కోట్ల సేకరణ

by S Gopi |

ఇది భారత్‌లో ఒక ఏడాదిలోనే అత్యధికంగా సమీకరించిన మొత్తం

IPOs: ఐపీఓల ద్వారా రికార్డు స్థాయి రూ. 1.76 లక్షల కోట్ల సేకరణ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది ఐపీఓల ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించాయి. రికార్డు స్థాయిలో గరిష్ట స్థాయికి చేరుకున్న ఐపీఓ మార్కెట్ ఏకంగా రూ. 1.76 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. ఇది భారత్‌లో ఒక ఏడాదిలోనే అత్యధికంగా సమీకరించిన మొత్తం. అంతేకాకుండా 2023, 2024 సంవత్సరాల్లో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ. ఇందుకు ప్రధానంగా చాలామంది దేశీయ పెట్టుబడిదారులు యాప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఐపీఓల షేర్లను కొనడం, మ్యూచువల్ ఫండ్‌లు, విదేశీ మదుపర్లు కూడా కొత్త షేర్లలో పెద్ద మొత్తం పెట్టుబడి, తక్కువ వడ్డీ రేట్లు, అధిక పొదుపు అవకాశాలు, దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి అధికంగా ఉండటంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరగడం వంటి కారణాలుగా ఉన్నాయి. ఈ పరిణామాలే మదుపర్లకు ఐపీఓలలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ విశ్వాసాన్ని కలిగించాయి. కంపెనీలు కూడా వ్యాపార వృద్ధి కోసం, అప్పులు చెల్లించేందుకు నిధులు సేకరించడం పెరిగింది. వచ్చే ఏడాదిలోనూ ఈ ధోరణి కొనసాగవచ్చని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా టెలికాం, ఫైనాన్స్ రంగాలకు చెందిన పెద్ద కంపెనీలు కూడా త్వరలో ఐపీఓలను ప్లాన్ చేస్తున్నాయి. 2026లో 190కి పైగా కంపెనీలు ఐపీఓకు రావొచ్చని అంచనా. ఈ కంపెనీలు సుమారు రూ. 2.5 లక్షల కోట్ల వరకు సమీకరించాలని చూస్తున్నాయి.

Next Story