- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigbasket: దీపావళి అమ్మకాలలో బిగ్‌బాస్కెట్ రికార్డు
క్విక్ ఎలక్ట్రానిక్స్ డెలివరీ కోసం క్రోమాతో భాగస్వామ్యం కూడా కలిసి వచ్చిందని బిగ్‌బాస్కెట్ అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజామాన్యంలోని ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్ ఈ ఏడాది దీపావళి అమ్మకాల్లో రికార్డులు నమోదు చేసింది. పండుగ సీజన్ అమ్మకాల్లో ఏకంగా 500 శాతం వృద్ధిని సాధించినట్టు వెల్లడించింది. ఐఫోన్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, లైటింగ్, ఆడియో పరికరాలకు భారీ డిమాండ్ ఉండటమే ఈ స్థాయి అమ్మకాలకు కారణమని కంపెనీ తెలిపింది. క్విక్ ఎలక్ట్రానిక్స్ డెలివరీ కోసం క్రోమాతో భాగస్వామ్యం కూడా కలిసి వచ్చిందని బిగ్‌బాస్కెట్ అభిప్రాయపడింది. దీపావళికి 15 రోజుల ముందుగానే పండుగ షాపింగ్ సేల్‌ను ప్రారంభించాం. అక్టోబర్ మొదటి వారం నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ధనత్రయోదశికి వ్యాపారం అత్యధికంగా జరిగింది. బంగారం, వెండి నాణేల అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 1000 శాతం పెరిగాయని కంపెనీ పేర్కొంది.
సాంప్రదాయ పండుగ వస్తువులు రెండంకెల వృద్ధి
సాంప్రదాయ పండుగ ఉత్పత్తులు మొత్తం అమ్మకాల్లో ఎక్కువ లాభాలను అందించాయి. పూజా సామగ్రి 35 శాతం, పువ్వులు, ఆకులు 45 శాతం, అగరుబత్తిలు, ధూపాలు 90 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీపావళి స్వీట్లు, చాక్లెట్లు 50 శాతం, టపాకాయలు, పాత్రలు 170 శాతం పెరిగాయని బిగ్‌బాస్కెట్ వివరించింది.
10 నిమిషాల్లో డెలివరీ
బిగ్‌బాస్కెట్ చీఫ్ బైయింగ్ అండ్ మర్చండైజింగ్ ఆఫీసర్ శేషు కుమార్ మాట్లాడుతూ.. పండుగ షాపింగ్‌లో సాంకేతికత, సంప్రదాయ కలయిక ఈ వృద్ధికి మరింత దోహదపడిందన్నారు. గిరాకీ ఉన్న విభాగాల్లో చివరి నిమిషంలో కొనుగోలు చేసే వాటిని 10 నిమిషాల డెలివరీ సేవలను ఉపయోగించుకున్నామని చెప్పారు.






