Iphone Air: ఐఫోన్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్

by S Gopi |

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ. 20,000 తగ్గింపు ధరకు ఐఫోన్ ఎయిర్ విక్రయానికి ఉంచింది.

Iphone Air: ఐఫోన్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్ ఎయిర్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ. 20,000 తగ్గింపు ధరకు ఐఫోన్ ఎయిర్ విక్రయానికి ఉంచింది. 256జీబీ వేరియంట్ అసలు ధర రూ. 1,19,900 ఉండగా, అమెజాన్ అన్ని రకాల ఆఫర్లతో రూ. 90,900 ధరకే అందిస్తోంది. వినియోగదారులు అదనంగా బ్యాంకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో పాటు వడ్డీ లేని ఈఎంఐ సదుపాయన్ని కూడా ఎంచుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ. 4,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 12 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్లు, అలాల్గే అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుందని అమెజాన్ వెల్లడించింది.

Next Story