Stock Market: స్టాక్ మార్కెట్ల రికవరీ

by S Gopi |

దీనికి ప్రధానంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను నిలిపేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా కోలుకోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా మారడం కలిసొచ్చింది.

Stock Market: స్టాక్ మార్కెట్ల రికవరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ యుద్ధ వాతావరణం కారణంగా భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ వారంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారీ నష్టాలు చూసిన సూచీలు గురువారం కొంత రికవరీ సాధించాయి. దీనికి ప్రధానంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను నిలిపేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా కోలుకోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా మారడం కలిసొచ్చింది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్‌తో జరిగిన చర్చల్లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రమ్‌ను ఆపడానికి అంగీకరించాయని కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆ తర్వాత ఇరాన్ వాటిని ఖండించింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఓ దశలో 1,100 పాయింట్లకు పైగా పుంజుకుంది.

మరోవైపు, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు ఎక్కువ రోజులు కొనసాగకపోవచ్చనే సంకేతాలతో గ్లోబల్, ఆసియా మార్కెట్లు రాణించాయి. వీటితో పాట్ హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు తక్కువ ధరకు బీమా కల్పించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మన మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది. అవసరం అనుకుంటే, చమురు నౌకలకు అమెరికా నౌకాదళం ఎస్కార్ట్‌గా నిలుస్తాయని కూడా చెప్పారు. ఈ పరిణామాలు గురువారం అధిక లాభాలకు కారణమయ్యాయి. దీనివల్ల మదుపర్ల సంపద గురువారం రూ. 6 లక్షల కోట్లు పుంజుకుంది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.452.96 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 899.71 పాయింట్లు లాభపడి 80,015 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు పెరిగి 24,765 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 91.64గా ఉంది.

Next Story