ఇన్స్టామార్ట్ ఆర్డర్స్.. లక్ష రూపాయల కండోమ్స్

by Muthe.Rajitha |

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్‌ విడుదల చేసిన 2025 యాన్యువల్‌ ఆర్డర్‌ అనాలసిస్‌ నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇన్స్టామార్ట్ ఆర్డర్స్.. లక్ష రూపాయల కండోమ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్‌కామర్స్‌ విభాగం ఇన్‌స్టామార్ట్‌ విడుదల చేసిన 2025 యాన్యువల్‌ ఆర్డర్‌ అనాలసిస్‌ నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై వ్యక్తి కండోమ్‌లపై లక్ష రూపాయలు వెచ్చించినట్టు తెలపడం సంచలనం రేపింది. ఇక కొచ్చికి చెందిన వ్యక్తి ఏడాదిలో 368 సార్లు కరివేపాకు ఆర్డర్‌ చేసినట్టు పేర్కొంది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కేవలం రూ.10తో ప్రింటవుట్లు ఆర్డర్‌ చేసినట్టు తెలిపింది.

హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి లేటెస్ట్‌ ఐఫోన్‌ మోడళ్ల కోసం రూ.4.3 లక్షలు ఖర్చు చేయగా.. ముంబయికి చెందిన వ్యక్తి రూ.15.16 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్‌ చేసిన వస్తువుల్లో కరివేపాకు, పెరుగు, గుడ్లు, పాలు, అరటిపండ్లు ఉన్నాయని నివేదిక తెలిపింది. ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆర్డర్లు అత్యధికంగా నమోదైనట్లు ఇన్‌స్టామార్ట్‌ వెల్లడించింది.

Next Story