- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Infosys: ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్ల నియామకం: ఇన్ఫోసిస్
మొదటి త్రైమాసికంలో ఇప్పటికే 17,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నట్టు పరేఖ్ తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాదిలోపు ఏకంగా 20,000 మంది ఫ్రెషర్ల నియామకాలు చేపడతామని వెల్లడించింది. ఈ మేరక కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇప్పటికే 17,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నట్టు పరేఖ్ తెలిపారు. దీనికి అదనంగానే మరో 20 వేల మంది కొత్త గ్రాడ్యుయేట్లను తీసుకుంటామని పేర్కొన్నారు. బుధవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కృత్రిమ మేధ(ఏఐ)లో స్కిల్స్‌ను పెంపొందించడంపై కంపెనీ ఎక్కువగా దృష్టి సారించింది. అత్యంత వేగంగా మారుతున్న సాంకేతిక రంగంలో ముందంజలో కొనసాగేందుకు ఈ నియామకాలు ఉపయోగపడతాయి. ఇప్పటికే కంపెనీ ఏఐలో పెట్టుబడులు పెట్టిందని, అందుకోసం సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చిందని సలీల్ పరేఖ్ అన్నారు. ఇప్పటివరకు, కంపెనీ ఏఐ, సంబంధిత రంగాలలో వివిధ స్థాయిలలో సుమారు 2.75 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఏఐకి డీప్ ఆటోమేషన్, ఇన్‌సైట్స్ అవసరమవుతుంది. దానికి తగినట్టుగా స్కిల్స్ అవసరం. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులతో పాటు టెక్ సామర్థ్యాలను పెంచుకునే దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తోందని సలీల్ పరేఖ్ వివరించారు. ఇటీవల దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ 12 వేల మందిని తొలగిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ నిర్ణయం ఐటీ రంగంలో చర్చకు దారితీసింది.






