- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Infosys: పనిచేయడానికి అనువైన కంపెనీల్లో ఇన్ఫోసిస్ అగ్రస్థానం
ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో భారీగా నియామకాలు చేపట్టడం ద్వారా ఇన్ఫోసిస్ నంబర్ 1 స్థానానికి చేర్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: మనదేశంలో పనిచేయడానికి ఉత్తమ కంపెనీల జాబితాలో ఈసారి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ లింక్డ్ఇన్ విడుదల చేసిన ‘టాప్-25 కంపెనీలు2026’ జాబితా ప్రకారం, టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల సంస్థలు ఇందులో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో భారీగా నియామకాలు చేపట్టడం ద్వారా ఇన్ఫోసిస్ నంబర్ 1 స్థానానికి చేర్చింది. ఆ తర్వాత యాక్సెంచర్, అమెజాన్, జేపీమోర్గాన్‌ఛేజ్, శాప్ కంపెనీలు టాప్-5లో చోటు సంపాదించాయి. ఈ కంపెనీల్లో ప్రధానంగా ఇంజనీరింగ్, ఐటీ, కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ వంటి ఉద్యోగాలకు డిమాండ్ అధికంగా ఉంది. ఎస్‌క్యూఎల్, జావా, పైథాన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి స్కిల్స్ ఇప్పటికీ అత్యంత కీలకంగా కొనసాగుతున్నాయి. నియామకాల పరంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఇక, ఏఐ జాబ్ మార్కెట్‌ను వేగంగా మారుస్తోంది. గత 18 నెలల్లో ఏఐ టూల్స్ ఉపయోగించే ప్రొఫెషనల్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎల్ఎల్ఎం ఆపరేషన్స్, ఆటోమేషన్ వంటి కొత్త స్కిల్స్‌కు డిమాండ్ పెరుగుతోందని లింక్‌డ్ఇన్ పేర్కొంది.






