- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రెషర్స్ కు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. వారికే అత్యధిక జీతం
దేశంలో అత్యంత వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఐటీ రంగంలో మార్పులు మొదలవుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అత్యంత వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఐటీ రంగంలో మార్పులు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ కొత్త స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేస్తున్నది. ఫ్రెషర్లకు ఎంట్రీ లెవల్ జీతాలను గరిష్టంగా ఏడాదికి రూ.21లక్షలకు పెంచింది. స్పెషలైజ్డ్ టెక్ రోల్స్ కోసం ఫ్రెషర్లకు ఈ ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కీలక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) స్కిల్స్ ఉన్న ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే క్రమంలో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం దేశంలోని ఇతర ఐటీ కంపెనీల్లో స్పెషలైజ్డ్ రోల్స్ కోసం ఇచ్చే ఎంట్రీ లెవల్ వేతనంతో పోలిస్తే ఇన్ఫోసిస్ చాలా ఎక్కువ జీతం ప్రకటించింది. ఇన్ఫోసిస్ 2025 గ్రాడ్యుయేట్ల కోసం ఆఫ్ క్యాంపస్ నియామక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ప్రత్యేక టెక్నాలజీ రోల్స్ కోసం కంపెనీ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులను తీసుకుంటోంది. వేతన ప్యాకేజీలు ఏడాదికి రూ.7 నుంచి రూ.21 లక్షల వరకు నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్ఫోసిస్ 20 వేల మంది ఫ్రెషర్లను తీసుకుంటామని గతంలో ప్రకటించింది. ప్రథమార్థంలో 12వేల మందిని నియమించగా, మరిన్ని నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.






