Infosys: సీఈఓ సలీల్ పరేఖ్‌కు ఇన్ఫోసిస్ రూ. 51.75 కోట్ల స్టాక్ గ్రాంట్‌

by S Gopi |

ఇందులో రూ. 34.75 కోట్ల విలువైన షరతులతో కూడిన షేర్ యూనిట్స్ ఉన్నాయి, ఇవి కంపెనీ నిర్దేశించిన పనితీరు లక్ష్యాలు సాధించిన తర్వాతే లభిస్తాయి

Infosys: సీఈఓ సలీల్ పరేఖ్‌కు ఇన్ఫోసిస్ రూ. 51.75 కోట్ల స్టాక్ గ్రాంట్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్‌కు కంపెనీ బోర్డు భారీగా స్టాక్ గ్రాంట్‌ను ఆమోదించింది. పనితీరు ఆధారిత స్టాక్ ఇన్సెంటివ్‌ల కింద మొత్తం రూ. 51.75 కోట్ల విలువైన ఈ స్టాక్ గ్రాంట్లు నగదు రూపంలో కాకుండా, కంపెనీ షేర్ల రూపంలో లభిస్తాయి. ఇందులో రూ. 34.75 కోట్ల విలువైన షరతులతో కూడిన షేర్ యూనిట్స్ ఉన్నాయి, ఇవి కంపెనీ నిర్దేశించిన పనితీరు లక్ష్యాలు సాధించిన తర్వాతే లభిస్తాయి. అలాగే, ఎక్స్‌పాండెడ్‌ స్టాక్‌ ఓనర్‌షిప్ కింద రూ. 10 కోట్లు, రూ.2 కోట్ల ఈఎస్‌జీ గ్రాంట్, రూ.5 కోట్ల టీఎస్‌ఆర్‌ గ్రాంట్‌ ఇవ్వనున్నారు. సలీల్ పరేఖ్‌ పదవీకాలం 2027 మార్చి నాటికి ముగుస్తుంది. ఈ కేటాయింపులు 2015 స్టాక్ ఇన్సెంటివ్ ప్లాన్ కింద మంజూరయ్యాయి. దీని ద్వారా ఈ షేర్లు 12 నెలల తర్వాత ఆయనకు లభిస్తాయి. ఇక, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్ఫోసిస్ ఆదాయ వృద్ధి అంచనాలు మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉండటంతో, శుక్రవారం కంపెనీ షేర్లు 7.09 శాతం పతనాన్ని చూశాయి. ఈ నేపథ్యంలో, పరేఖ్‌కు ఇచ్చిన ఈ భారీ స్టాక్ గ్రాంట్ ఇప్పుడు కేవలం పారితోషికంగా కాకుండా, కంపెనీ భవిష్యత్ పనితీరుతో ముడిపడిన అంశంగా మారింది.

Next Story