- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Wholesale Inflation : 10 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
సమీక్షించిన నెలలో టోకు ద్రవ్యోల్బణం పెరిగేందుకు ప్రధానంగా తయారీ ఉత్పత్తులు, బేసిక్ మెటల్స్, ఆహార ఉత్పత్తులు, టెక్స్‌టైల్ తయారీలో ధరలు ఖరీదవడమే కారణం.

దిశ, బిజినెస్ బ్యూరో: 2024 ఆధార సంవత్సరంగా (బేస్ ఇయర్) కొత్త సిరీస్‌లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం, ఈ ఏడాది జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 10 నెలల గరిష్ఠ స్థాయి 1.81 శాతానికి పెరిగింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. సమీక్షించిన నెలలో టోకు ద్రవ్యోల్బణం పెరిగేందుకు ప్రధానంగా తయారీ ఉత్పత్తులు, బేసిక్ మెటల్స్, ఆహార ఉత్పత్తులు, టెక్స్‌టైల్ తయారీలో ధరలు ఖరీదవడమే కారణం. గత నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 1.41 శాతానికి పెరిగింది. ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో -2.31 శాతం తగ్గిన తర్వాత జనవరిలో -4.01 శాతంతో ప్రతికూల ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 2.86 శాతంగా నమోదైంది. ఇక, జనవరి నెలలో కూరగాయలు ధరలు 6.78 శాతంతో మళ్లీ పెరిగాయి. ఉల్లి ధరలు డిసెంబర్‌లో 54.40 శాతం తగ్గిన తర్వాత జనవరిలో 33.42 శాతానికి తగ్గాయి. బంగాళదుంప ధరలు మరింత క్షీణించి 38.21 శాతంగా నమోదయ్యాయి.






