- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Retail Inflation: సెప్టెంబర్‌లో 8 ఏళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. సోమవారం కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైంది. ఇది 2017 తర్వాత నమోదైన అత్యల్పమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, అంతకుముందు ఆగష్టులో నమోదైన 2.07 శాతం కంటే కూడా భారీగా దిగొచ్చింది. సమీక్షించిన నెలలో ద్రవ్యోల్బణ తగ్గుదలకు ప్రధానంగా కూరగాయలతో పాటు పాటు వంటనూనె, పండ్లు, తృణ ధాన్యాలు, పప్పుధాన్యాలు, గుడ్లు, ఇంధన ధరలు తగ్గిపోవడమే. సెప్టెంబర్ నెలలో అహార పదార్థాల ద్రవ్యోల్బణం -2.28 శాతంగా ఉంది. 2018, డిసెంబర్ తర్వాత ఆహర ద్రవ్యోల్బణం అత్యల్పంగా నమోదైంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ద్రవ్యోల్బణం -2.17 శాతం, పట్టణ ప్రాంతాల్లో -2.47 శాతం ఉంది. గత నెలలో ఇంధన ద్రవ్యోల్బణం 2.43 శాతంగా, విద్యుత్ ధరలు ఆగస్టులో 2.43 శాతం నుంచి సెప్టెంబర్‌లో 1.98 శాతానికి తగ్గాయి. కూరగాయల ధరలు సెప్టెంబర్ నెలలో 21.38 శాతం తగ్గాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.






