GST Collection: నవంబర్‌లో రూ. 1.70 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

by S Gopi |

జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఆదాయం స్వల్పంగా తగ్గింది.

GST Collection: నవంబర్‌లో రూ. 1.70 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో స్థిరమైన వృద్ధిని సాధించాయి. పండుగ సీజన్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఆదాయం స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా కొనుగోళ్లు జోరందుకోవడంతో ప్రభుత్వానికి ఇప్పటికీ మెరుగైన జీఎస్టీ ఆదాయం వచ్చినట్టే. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1,70,276 కోట్లు వచ్చాయి. ఇది గతేడాది ఇదే నెలతో పోలిస్తే స్వల్పంగా 0.7 శాతం పెరిగాయి. 2024, నవంబర్‌లో రూ. 1.69 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం నమోదైంది. మొత్తం జీఎస్టీ వసూళ్లలో రీఫండ్లు రూ. 18,196 కోట్లు చెల్లించిన తర్వాత నికర జీఎస్టీ ఆదాయం రూ. 1,52,079 కోట్లుగా ఉంది. మొత్తం వసూళ్లలో ఐజీఎస్టీ రూ. 46,934 కోట్లు, సీజీఎస్టీ రూ. 34,843 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 42,522 కోట్లు వచ్చాయి. దిగుమతుల ద్వారా పన్ను వసూళ్లు 10.2 శాతం పెరిగి రూ. 45,976 కోట్లు వచ్చాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Next Story