Economy: మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 7.8 శాతం

by S Gopi |

కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన వృద్ధి గతేడాది కాలంలో నమోదైన 7.4 శాతం కంటే ఎక్కువగానే ఉందని తెలిపింది.

Economy: మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 7.8 శాతం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం కొత్త సిరీస్‌లో జీడీపీ డేటాను విడుదల చేసిన కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన వృద్ధి గతేడాది కాలంలో నమోదైన 7.4 శాతం కంటే ఎక్కువగానే ఉందని తెలిపింది. గతంలో జీడీపీ డేటాను 2011-12 బేస్ సంవత్సరంతో లెక్కించేవారు, తాజా గణాంకాలు 2022-23 ఆర్థిక సంవత్సరం ఆధారంగా గణిస్తారు. వృద్ధిని పాత వివరాలతో కాకుండా ఇటీవలి ఆర్థిక పరిస్థితులతో పోల్చారు. ఈ కొత్త సిరీస్‌లో జీఎస్​టీ పన్ను రికార్డులు, ఈవాహన్‌‌ డేటాతో పాటు ఇంటి పనులు చేసే మనుషుల గురించి, డ్రైవర్ల సేవలను కూడా చేర్చారు. దీనివల్ల ఆర్థిక పరమైన లెక్కలు మరింత ఖచ్చితంగా ఉంటాయని కేంద్రం భావిస్తోంది. ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా ఎలా పనిచేస్తుందో స్పష్టంగా, మరింత ఖచ్చితంగా తెలిసేందుకు సహాయపడతాయి. అలాగే, కొత్త సిరీస్ కింద ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.6 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

Next Story