BIG BREAKING: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి పతనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-15 10:00:46  IST  )

డాలర్ తో పోలిస్తే.. రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పతనమైంది. ఇన్ ట్రా డే లో 3 పైసలు క్షీణించింది.

BIG BREAKING: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి పతనం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికన్ డాలర్ తో పోలిస్తే.. రూపాయి విలువ మరింత పతనమైంది. శుక్రవారం మధ్యాహ్నం ఇన్ ట్రా డే లో గతంలో ఎన్నడూ లేని రీతిలో.. రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి చేరుకోవడం గమనార్హం. ఈ పరిణామం భారత్ బాహ్య రంగానికి సవాళ్లను మరింత పెంచుతోంది. యూఎస్ డాలర్ తో పోలిస్తే.. రూపాయి విలువ 0.3 శాతం క్షీణించి 96.07 వద్దకు పడిపోయింది. గత సెషన్లో రూపాయి విలువ 95.9575 కనిష్టానికి చేరుగా.. తాజాగా మరింత పతనమై కొత్త రికార్డును నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న ఒత్తిడుల కారణంగా రూపాయి మారకం విలువ వరుసగా పతనమవ్వడం.. ఆర్థిక వర్గాల్లో ఆందోళనను పెంచుతోంది.

రూపాయి విలువ పతనమవ్వడానికి కారణం.. చమురు దిగుమతులు పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. భారత్ తన అవసరాలకు కావలసిన చమురులో 80 శాతంకంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటోందని, దీంతో చమురు ధరలు బ్యారెల్ కు 110 డాలర్లకు చేరగా.. దిగుమతుల భారం పెరిగి డాలర్లకు డిమాండ్ ఏర్పడటం వల్ల రూపాయి విలువ పతనమైనట్లు వివరించారు. ఇంధన దిగుమతుల ఖర్చులు పెరిగితే.. దాని ప్రభావం ట్రేడ్ డెఫిసిట్ పై తీవ్రంగా ఉంటుందని తెలిపారు.

Next Story