డాలరుతో చారిత్రాత్మక కనిష్ఠానికి పతనమైన రూపాయి.. స్టాక్ మార్కెట్ల పరిస్థితి?

by Naga Rani Yarlagadda |

డాలరుతో పోలిస్తే భారత్ రూపాయి చారిత్రాత్మక కనిష్ఠానికి పతనమైంది. డాలర్ విలువ రూ.88.16కు చేరడం ఆందోళనకు గురిచేస్తోంది.

డాలరుతో చారిత్రాత్మక కనిష్ఠానికి పతనమైన రూపాయి.. స్టాక్ మార్కెట్ల పరిస్థితి?
X

దిశ, వెబ్‌డెస్క్: డాలరుతో పోలిస్తే భారత్ రూపాయి చారిత్రాత్మక కనిష్ఠానికి పతనమైంది. డాలర్ విలువ రూ.88.16కు చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా విధించిన టారిఫ్ లు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వల్లే రూపాయి విలువ తగ్గిపోతోందని నిపుణులు చెప్తున్నారు. గడిచిన రెండుమూడ్రోజుల్లో 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్ నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో మంగళవారం ఉదయం ట్రేడింగ్ సమయంలో రూపాయి మరో 6 పైసలు పతనమైంది. నిన్న రూపాయి 88.10 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠస్థాయిలో ముగియగా.. నేడు ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 88.14 వద్ద ప్రారంభమై.. 88.16కి పడిపోయింది.

డాలర్ తో రూపాయి విలువ పతనమవుతున్నా.. స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 207 పాయింట్లు పెరిగి.. 80,571 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 24,685 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లపై ట్రూత్ సోషల్ లో కీలక పోస్ట్ చేశారు. భారత్ తన టారిఫ్ లను పూర్తిగా తగ్గించుకునేందుకు ముందుకు వచ్చింది కానీ.. చాలా ఆలస్యమైందన్నారు. రష్యాతో చమురు, సైనిక ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తూ.. తమతో చాలా తక్కువ వ్యాపారం చేస్తుందన్నారు.

Next Story