- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nirmala Sitaraman: 2032 నాటికి 6వ అతిపెద్ద బీమా మార్కెట్‌గా భారత్
2032 నాటికి ఆరవ అతిపెద్ద బీమా మార్కెట్‌గా ఎదగనుందని తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతేకాకుండా 2032 నాటికి ఆరవ అతిపెద్ద బీమా మార్కెట్‌గా ఎదగనుందని తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి బుధవారం జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో ప్రభుత్వం వ్యాపారాల కోసం చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాల్లో మార్పులు చేసిందని, వ్యక్తుల కోసం చేసిన సంస్కరణలు చేశామని చెప్పారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో నిర్మలా సీతారామన్.. భారత్ ప్రపంచ ఫిన్‌టెక్ విప్లవానికి నాకయకత్వం వహిస్తోందని, ప్రస్తుతం మూడో అతిపెద్ద ఫిన్‌టెక్ రంగ దేశంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం రియల్-టైమ్ లావాదేవీలను భారత్ నిర్వహిస్తోందని, ప్రపంచంలోనే అత్యధిక ఫిన్‌టెక్ స్వీకరణ రేటు 87 శాతాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.






