పెరగనున్న ఇళ్ల ధరలు.. ఎంతంటే!?

by Disha Web Desk 17 |
పెరగనున్న ఇళ్ల ధరలు.. ఎంతంటే!?
X

న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి మొదలు కానున్న 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 5 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఇళ్ల ధరలు 8-10 శాతం పెరిగాయని తెలిపింది. నిర్మాణ ఖర్చులు భారం కావడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, దేశీయ-అంతర్జాతీయంగా కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల మధ్య స్థిరాస్తి రంగం మెరుగైన వృద్ధిని సాధించింది.

అయితే మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణం వల్ల డిమాండ్‌పై ప్రతికూల ప్రభవం చూపాయని, ఈ ఏడాది ద్వితీయార్థంలో గిరాకీ పెరిగే వీలుందని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. ధరలు పెరిగినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు 9 శాతం మేర పెరగవచ్చని అంచనా వేసింది. క్రమంగా పెరుగుతున్న నిర్మాణ ఖర్చుల వల్ల డెవలపర్లు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించేందుకు ఇప్పటికే కొంతవరకు ధరలు పెంచగ, వడ్డీ రేట్ల పెంపు ధోరణి కొనసాగితే మరికొంత పెంచవచ్చని పేర్కొంది.

Also Read...

అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి Activa125!


Next Story

Most Viewed