- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HPCL: రష్యా చమురుపై ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలు రాలేదు: హెచ్‌పీసీఎల్
హెచ్‌పీసీఎల్ రష్యా చమురును ప్రాసెస్ చేసే ప్రక్రియను తగ్గించింది

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యా నుంచి చమురు కొంటున్నదనే కారణంతో భారత్‌పై అమెరికా టారిఫ్‌ను 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఛైర్మన్, ఎండీ వికాస్ కౌశల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని లేదా కొనసాగించాలనే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, బదులుగా పరిస్థితులను బట్టి చమురు దిగుమతులపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం తమకుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హెచ్‌పీసీఎల్ రష్యా చమురును ప్రాసెస్ చేసే ప్రక్రియను తగ్గించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలలో ప్రాసెస్ చేసిన మొత్తం ముడి చమురులో రష్యా ముడిచమురు కేవలం 13.2 శాతం మాత్రమే. ఇందుకు భౌగోళిక రాజకీయ పరిస్థితులే కారణం. ఈ విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. భవిష్యత్తులో మరే కారణంగానైనా రష్యా ముడిచమురు కొనవద్దని ఆదేశాలిస్తే, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే వీలుంటుందని ఆయన వివరించారు. రష్యా చమురును కొనడం లేదని చెప్పట్లేదు. రష్యా ముడిచమురు ప్రాసెస్ చేయకపోవడం వల్ల ఎంతమేర నష్టం ఉంటుందనే అంశాలను పరిశీలించాం. ఆర్థికంగా ఎక్కడ తక్కువకు లభిస్తే అక్కడి నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తాం. రష్యా చమురు కొనకపోవడం వల్ల పెద్ద ప్రభావం ఉండదని వికాస్ వెల్లడించారు.






