భారత స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో 80 శాతం ఐఫోన్లే!

by Disha Web Desk 6 |
భారత స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో 80 శాతం ఐఫోన్లే!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది మే నెలలో భారత్ నుంచి మొత్తం రూ. 12,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు జరిగాయి. అందులో ప్రీమియం బ్రాండ్ ఐఫోన్‌ల వాటాయే రూ. 10,000 కోట్లు ఉందని ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) వెల్లడించింది. మార్చితో ముగిసిన 2022-23లో భారత్ నుంచి 5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా) విలువైన ఐఫోన్ల ఎగుమతులు జరిగాయి. దేశీయంగా ఈ మైలురాయిని దాటిన మొదటి బ్రాండ్ ఐఫోనే కావడం విశేషం. ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రెండు నెలల వ్యవధిలో రూ. 20 వేల కోట్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి.

గతేడాది ఇదే సమయంలో రూ. 9,066 కోట్ల విలువైన ఐఫోన్ల ఎగుమతి చేసింది. ఐసీఈఏ డేటా ప్రకారం, భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం స్మార్ట్‌ఫోన్లలో 80 శాతం ఐఫోన్లే ఉన్నాయి. మిగిలిన దాంట్లో శాంసంగ్ సహా ఇతర బ్రాండ్లు ఉన్నాయి. యాపిల్ సంస్థ తయారీతో సరఫరాను చైనా నుంచి ఇతర ప్రాంతాలకు మార్చాలనే లక్ష్యంతో ఉంది. అందులో భాగంగానే దేశీయంగా తయారీని పెంచి ఎగుమతులను విస్తరిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తులను సైతం కంపెనీ తయారు చేయనుంది.

Also Read..

₹1 లక్ష కోట్ల వాల్యుయేషన్‌ను దాటిన బ్యాంక్ ఆఫ్ బరోడా


Next Story

Most Viewed